ప్రధానితో భేటీ కానున్న హోం మంత్రి షిండే
కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే
ఈ రోజు ప్రధాని మన్మోహన్ సింగ్ తో భేటీ కానున్నారు. ఈ సాయంత్రం నాలుగు
గంటలకు జరిగే ఈ సమావేశంలో షిండే, తెలంగాణ అంశంపై ప్రధానితో చర్చించే అవకాశం
కనబడుతోంది. కాగా, ప్రస్తుతం సీఎం కిరణ్ కుమార్ ఢిల్లీలో ఉండటంతో ఈ భేటీ
మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.